: ప్రముఖ న్యూస్ యాంకర్ మవో కొబయషి కన్నుమూత
రొమ్ము కేన్సర్‌తో పోరాడుతున్న జపాన్ కు చెందిన ప్రముఖ న్యూస్ యాంకర్ మవో కొబయషి (34) కన్నుమూశారు. ఆమె తన స్ఫూర్తిదాయక జీవితం, నైపుణ్యాలతో 2016లో బీసీసీ ప్రకటించిన ప్రపంచంలోని స్ఫూర్తిదాయక వంద మంది మహిళల్లో చోటు సంపాదించుకుంది. ఎంతో ఉత్సాహంగా కనిపించే ఆమె.. రెండేళ్ల క్రితం తనకు రొమ్ము కేన్సర్ ఉందని ప్రకటించింది. ఆ న్యూస్ చూసి షాక్ అవడం అందరివంతయింది. తనకు కేన్సర్ అని తెలిసినప్పటికీ ఆమె ఏ మాత్రం నిరుత్సాహపడకుండా కేన్సర్‌తో పోరాడుతూ తనలా ఆ వ్యాధి బారిన పడ్డ రోగులకు మద్దతుగా నిలిచింది.
మవో కొబయషి తన రచనలతో ప్రజలను చైతన్యపరిచింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. 34 ఏళ్ల వయసులోనే ప్రాణాలు కోల్పోవడం ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మరణంపై జపాన్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేస్తూ కేన్సర్‌పై ఆమె పోరాడిన తీరు ఎంతో ఆదర్శమని ప్రశంసించింది.