: అల్లరి చేస్తున్నారని పిల్లలిద్దరినీ కారులో బంధించిన తల్లి.. ఊపిరాడక చనిపోయిన చిన్నారులు!
పిల్లలు అల్లరి చేస్తున్నారని ఓ తల్లి వారిని కారులో పడేసి డోర్ లాక్ చేయడంతో ఆ చిన్నారులు ఊపిరి ఆడక మృతి చెందిన ఘటన అమెరికాలోని టెక్సాస్ లో చోటు చేసుకుంది. ఆ చిన్నారుల తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు ఈ రోజు వివరాలు వెల్లడించారు. సైటీయా మారీయా రోడాల్ఫ్ (25) అనే మహిళ మూడేళ్లు కూడా నిండని తమ ఇద్దరు పిల్లలు అల్లరి చేస్తుండడంతో విసుగు చెందిందని చెప్పారు. పిల్లలు అల్లరి చేస్తున్నారని కోపం తెచ్చుకుని ఈ ఘటనకు పాల్పడిందని అన్నారు. పిల్లల్ని కారులో వదిలేశాక ఆమె ఇంట్లో కూర్చుని టీవీ చూసిందని చెప్పారు. కొన్ని గంటల తరువాత ఆమెకు ఆ పిల్లలు గుర్తుకు రావడంతో కారు వద్దకు వెళ్లి డోర్ ఒపెన్ చేసిందని, అప్పటికే ఆ పిల్లలు మరణించారని అన్నారు. ఆమె భర్త ఇచ్చి ఫిర్యాదు మేరకు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.