: యువకులు బోటులో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా దూకిన తిమింగలం.. మీరూ చూడండి!
అమెరికాలోని ఓ సముద్రంలో బోటులో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులు ఒక్కసారిగా తమ దగ్గర ఎగిరిపడిన తిమింగలాన్ని చూసి వణికిపోయారు. ఆ తిమింగలం ఇంకాస్త ముందుకు దూకి ఉంటే ఆ బోటు మునిగిపోయి ఉండేది. ఆ బోటులోని ఓ యువకుడు ఆ సముద్రాన్ని తన సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తిమింగలం ఎగిరిన ఆ దృశ్యం కెమెరాకు చిక్కింది. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. ఈ వీడియోను మీరూ చూడండి..