: బీజేపీ ఎంపీ వెళుతున్న కాన్వాయిని అడ్డుకుని... ఆయనను చితక్కొట్టారు!
ఓ బీజేపీ ఎంపీ వెళుతున్న కాన్వాయిని అడ్డుకుని, ఆయనను బయటకు లాగి చితక్కొట్టిన ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని కల్నాలో బీజేపీ ఎంపీ జార్జ్ బేకర్ తమ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్నారు. అయితే, ఆ రాష్ట్ర అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు సదరు బీజేపీ ఎంపీ కాన్వాయ్‌ని అడ్డుకుని, రెచ్చిపోయారు.
ఆ కారు అద్దాన్ని ధ్వంసం చేసి, ఎంపీ జార్జ్ పై దాడి చేశారు. దీంతో ఆయన వీపుపై గాయాలయ్యాయి. తాము ఎందుకు దాడికి పాల్పడుతున్నామో కూడా చెప్పకుండా ఆయనను కొట్టేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఘటనాస్థలికి చేరుకునేలోపే టీఎంసీ కార్యకర్తలు పారిపోయారు. ప్రస్తుతం ఎంపీ బేకర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.