: భర్త చేతిలో చెయ్యేసి ఉంచితే భార్య చేతి నొప్పి మటుమాయం!: పరిశోధనలో ఆసక్తికర విషయాలు
చేతి నొప్పులు మాయమై పోవాలంటే జీవిత భాగస్వామి చేతిలో చెయ్యేసి కొద్దిసేపు గడిపితే సరిపోతుందని అమెరికాలోని కొలరాడో బౌల్డర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 23 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సున్న 22 జంటలపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు ఇలా చేయడం వల్ల భర్త గుండె లయ, శ్వాసప్రక్రియ భార్య గుండె లయ, శ్వాసప్రక్రియ సమమవుతాయని తెలుసుకున్నారు. ప్రధానంగా ఆడవాళ్లకు ఈ టెక్నిక్ బాగా పనిచేస్తోందని తెలిపారు. వారికి ముంజేతుత్లో కొంచెం నొప్పి, మంట తరచుగా వస్తాయని తెలిపిన శాస్త్రవేత్తలు అందుకే వారిపై ఈ పరిశోధన చేసినట్లు పేర్కొన్నారు. భర్త చేతిని భార్య పట్టుకొని కాసేపు ఉంటే ఆమె చేతుల్లోని నొప్పి, మంట మాయం అవుతాయని అన్నారు.