: చిన్నారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు.. బోరు బావిలో నీటిని తోడేందుకు సూపర్ జెట్ మోటారును దింపిన సిబ్బంది


రంగారెడ్డి జిల్లా ఇక్కా గూడెంలో ఆడుకుంటూ బోరు బావిలో ప‌డిన‌ చిన్నారిని కాపాడేందుకు అధికారులు, స‌హాయ‌క సిబ్బంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బోరు బావిలో నీటిని తోడేందుకు సూపర్ జెట్ మోటారును దింపారు. ప్ర‌స్తుతం ఆ చిన్నారి సుమారు 180 అడుగుల లోతులో ఉన్న‌ట్లు అధికారులు భావిస్తున్నారు. ఘ‌ట‌నాస్థ‌లికి చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు కూడా త‌ర‌లివ‌స్తున్నారు. చిన్నారిని రక్షించేందుకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం నిపుణుల నుంచి స‌ల‌హాలు, సూచన‌లు తీసుకుంటున్నారు. చిన్నారి స్వ‌స్థ‌ల‌మైన యాలాల మండ‌లం గోరేప‌ల్లిలో స్థానికులు, విద్యార్థులు పూజ‌లు నిర్వ‌హిస్తూ ఆమె క్షేమంగా బ‌య‌ట‌కు రావాల‌ని కోరుకుంటున్నారు.

మ‌రోవైపు బోరు బావి య‌జ‌మాని మ‌ల్లారెడ్డిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ చిన్నారిని ఎప్పుడు బ‌య‌ట‌కు తీస్తారో అధికారులు కూడా చెప్ప‌లేక‌పోతున్నారు. బోరుబావిలో 180 అడుగుల లోతులో నీరు ఉందనీ, దానిని బ‌య‌ట‌కు తోడాకే పాప‌ను బయ‌ట‌కు తీసుకువ‌చ్చే వీలు ఉంటుంద‌ని మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News