: మోర్టార్ల‌తో దాడులకు దిగిన పాక్ బలగాలు


భారత్ చేతిలో ఎప్పటికప్పుడు చావు దెబ్బలు తింటున్నప్పటికీ పాకిస్థాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. భార‌త్ పాక్‌కు దీటుగా స‌మాధానం ఇస్తూ ఇటీవ‌ల పాక్ రేంజ‌ర్ల చెక్‌పోస్టుల‌ను కూడా ధ్వంసం చేసిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ పాక్‌ ఉగ్రవాదులను భారత్ లోకి పంపించడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు పాక్ రేంజర్లు పదే పదే దాడులకు తెగబడుతూ రెచ్చిపోతున్నారు. పాకిస్థాన్ ఈ రోజు మ‌రోసారి దాడుల‌కు దిగింది. జ‌మ్ముక‌శ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్ వ‌ద్ద మోర్టార్ల‌తో దాడులు చేస్తోంది. పాక్ బ‌ల‌గాల కాల్పుల‌ను భార‌త సైన్యం స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొడుతోంది.       

  • Loading...

More Telugu News