: నారా చంద్రబాబు నాయుడు పేరు మార్చుకోవాలి!: ఎమ్మెల్యే రోజా చురకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించడానికే టీడీపీ నేతలు ప్రయత్నాలు జరుపుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంటింటికీ మద్యాన్ని అమ్మిస్తూ మహిళల జీవితాల్లో నిప్పులు పోస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారా చంద్రబాబు నాయుడిగా పేరు మార్చుకోవాలని ఆమె చురకలంటించారు. రాష్ట్ర కేబినెట్‌లో తాగుబోతులంతా కూర్చొని బార్ పాలసీ తీసుకొచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. ఆడవారి సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు.