: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల అమెరికా ప్రత్యేక దౌత్యవేత్త పదవి నుంచి నిష్క్రమణ
అమెరికా తరఫున ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాలకు ప్రత్యేక దౌత్యవేత్తగా పనిచేస్తున్న లారెల్ మిల్లర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయా ప్రాంతాల్లో వేల సంఖ్యలో అమెరికా సాయుధ బలగాలను మోహరించాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆయన పదవి విడిచి వెళ్లారు. దీంతో ఆయా దేశాల్లో దౌత్య వ్యవహారాలు స్తంభించిపోయాయి. మిల్లర్ బాధ్యతలను ప్రస్తుతం దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో చూసుకుంటోంది. ఈ బ్యూరోకు కూడా ముఖ్య అధికారి లేకపోవడం గమనార్హం.
బలగాలను మోహరించడం, ముఖ్యపదవిలో లోటు ఏర్పడటం, దౌత్య ఆర్థిక కార్యకలాపాలు తగ్గించడం వంటి పరిణామాలు గమనిస్తుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదహారేళ్లుగా సాగుతున్న ఆఫ్ఘన్-అమెరికా వివాదాలకు చరమగీతం పాడే సూచనలు కనిపిస్తున్నాయని రాయబార కార్యాలయ అధికారుల అభిప్రాయం.