: లోకేశ్ కి జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదు.. జగన్ కు సవాలు విసురుతాడా?: రోజా
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే తనపై చేస్తోన్న ఆరోపణలను నిరూపించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సవాలు విసిరిన విషయం తెలిసిందే. ఈ సవాల్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ... జయంతికి, వర్ధంతికి తేడా తెలియకుండా అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యలు చేసే నారా లోకేశ్.. జగన్‌కు సవాలు విసురుతున్నారని ఎద్దేవా చేశారు. విస్తరాకుకి, తమలపాకుకి కూడా తేడా తెలియని వారు జగన్‌ను విమర్శిస్తున్నారని చురకలంటించారు. సింహం ముందు పందికొక్కు తొడకొడితే అది చూసి ప్రజలు నవ్వుకుంటారని వ్యాఖ్యానించారు. నారా లోకేశ్ ముందుగా జాతీయ జెండాకి సరిగా సెల్యూట్ చేయడం నేర్చుకోవాలని ఆమె వ్యంగ్యంగా అన్నారు. తమ అధినేత ప్రజల కష్టాలను గురించి పోరాడుతుంటే ఆయన విమర్శలు చేయడం ఏంటని రోజా మండిపడ్డారు.