: పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు!
పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జూలై 17 నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. జూలై 17నే భారత రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు తొలిరోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడనున్నాయి. లోక్ సభ సభ్యుడు వినోద్ ఖన్నా, రాజ్యసభ సభ్యురాలు పల్లవి రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు తదితరుల మృతికి సంతాపం తెలిపిన తర్వాత వాయిదా పడనుంది.