: ప్రేమించలేదని యువతి కిడ్నాప్... సినీ ఫక్కీ ఛేజింగ్ లో పోలీసులదే విజయం
ప్రేమించడం లేదని యువతిని కిడ్నాప్ చేసి పరారవుతున్న దుండగులను సినీ ఫక్కీలో ఛేజ్ చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే...చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం బస్టాండ్ వద్ద ఓ యువతిని దుండగులు బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతే కాకుండా వారు ఎటువైపు వెళ్తున్నారో కూడా తెలిపారు. దీంతో పోలీసులు వారి కారును వెంబడించారు. బుచ్చినాయుడు కండ్రిగ వద్దకు చేరుకుంటున్న సమయంలో వారిని పట్టుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా మనుబోలుకు చెందిన సతీష్ ఈ దారుణానికి ఒడిగట్టాడని, బాధితురాలు ప్రేమకు అంగీకరించకపోవడంతో స్నేహితుల సాయంతో కిడ్నాప్ చేసినట్టు పోలీసులు తెలిపారు.