: నిరాశపరిచిన 'ట్యూబ్ లైట్' సినిమాపై సల్మాన్ స్పందన!
భారీ అంచనాల మధ్య విడుదలైన సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'ట్యూబ్ లైట్' అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. ఈ సినిమాకు దారుణమైన రేటింగ్స్ వస్తున్నాయి. కథాబలం లేకపోవడంతో... సల్మాన్ క్రేజ్ కాని, గ్రాఫిక్స్ కాని ఈ సినిమాను గట్టెక్కించలేక పోయాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ స్పందిస్తూ... ఈ సినిమాకు ఇంకా దారుణమైన రివ్యూలు వస్తాయని తాను భావించినట్టు తెలిపాడు. సినీ విశ్లేషకులు -3, -4 రేటింగ్స్ ఇస్తారని భావించానని... కానీ, 1, 1.5 రేటింగ్స్ వచ్చాయని అన్నాడు. తన సంస్థ 'బీయింగ్ హ్యూమన్' తో పీవీఆర్ ఒప్పందం చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, సల్మాన్ ఈ విధంగా స్పందించాడు. అంతే కాదు, సినిమా విడుదలకు ముందే రివ్యూలు రాస్తున్న వాళ్లపై ఆయన విరుచుకుపడ్డాడు.