: బీసీసీఐకి ధన్యవాదాలు చెప్పి... తొలి టెస్టు టీమిండియాతో అయితే బాగుంటుందని కోరిన ఆఫ్ఘన్ క్రికెటర్!


ఆప్ఘనిస్థాన్ క్రికెటర్ మహ్మద్ నబీ బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు టెస్టు జట్టు హోదా పొందడంలో బీసీసీఐ చేసిన సాయం మరువలేమని అన్నాడు. ఇది ప్రతి ఆఫ్ఘన్ క్రికెటర్ చిరకాల వాంఛ అని చెప్పాడు. ఇన్నాళ్లకు తమ కల సాకారమైందని చెప్పాడు. ఈ కలను సాకారం చేయడంలో బీసీసీఐ పాత్ర ఎంతో ఉందని చెప్పాడు. అయితే తమ తొలి టెస్టు టీమిండియాతో గ్రేటర్ నోయిడాలో ఆడితే బాగుంటుందని మనసులో మాటను బయటపెట్టాడు.

భారత క్రికెట్ అభిమానుల ప్రోత్సాహం మరువలేనిదని, తమను స్వదేశీ ఆటగాళ్లలా ప్రోత్సహిస్తారని తెలిపాడు. కాగా, ఆఫ్ఘన్ వర్థమాన క్రికెటర్లకు బీసీసీఐ పలు సౌకర్యాలు కల్పించిన సంగతి తెలిసిందే. వర్థమాన క్రికెటర్లు తయారయ్యేందుకు ఎంవోయూ ప్రోగ్రాంలు కూడా బీసీసీఐ ఏర్పాటు చేస్తుంది. ఇక్కడి ఆటగాళ్లతో మ్యాచ్ లు నిర్వహిస్తూ ఆప్ఘన్ క్రికెటర్ల ప్రతిభను పెంచుతుంది. ఈ నేపథ్యంలో నబీ కోరిక తీరుతుందో లేదో చూడాలి. 

  • Loading...

More Telugu News