: శ్రుతిహాసన్‌ తప్పుకోలేదు... మేమే తప్పించాం!: 'సంఘమిత్ర' నిర్మాత


కోలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'సంఘమిత్ర' చిత్రం నుంచి తప్పుకుంటున్నానని... చిత్ర యూనిట్ తనకు బౌండ్ స్క్రిప్టు ఇవ్వలేదని, ఎన్నిరోజుల షెడ్యూల్ కావాలో కూడా చెప్పలేదని శ్రుతిహాసన్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తాజాగా చిత్ర నిర్మాత హేమరుక్మిణి తెలిపారు. శ్రుతిహాసన్‌ తప్పుకోవడంపై వివరణ కోరగా... ఆమె సినిమా నుంచి తప్పుకోలేదని, ఆమెను తామే తప్పించామని తెలిపారు.

భారీ బడ్జెట్ సినిమా అనగానే భారీ పారితోషికం అడిగిందని ఆమె చెప్పారు. సరే అని చెప్పామని, సినిమా కోసం విదేశాల్లో గుర్రపు స్వారీ నేర్చుకుంటానని చెప్పడంతో సరేనని భారీ మొత్తం ఇచ్చామని కూడా ఆమె చెప్పారు. అయితే ఈ విషయాలే కాకుండా శ్రుతిహాసన్‌ వ్యవహారశైలి భరించలేని విధంగా తయారవడంతో లాభం లేదని భావించి ప్రతిష్ఠాత్మక సినిమా నుంచి తప్పించామని ఆమె చెప్పారు. కాగా, సంఘమిత్ర సినిమాను తేనాండళ్ పతాకంపై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News