: పాకిస్థాన్ ట్రాఫిక్ పోలీసులు కూడా బుమ్రా పోస్టర్లు పెట్టారు!
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియన్ పేసర్ బుమ్రా వేసిన నోబాల్ చాలా పాప్యులర్ అయింది. గీత దాటితే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో చూడండి... ట్రాఫిక్ రూల్స్ పాటించండంటూ బుమ్రా గీత దాటిన ఫొటోతో జైపూర్ ట్రాఫిక్ పోలీసులు పోస్టర్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బుమ్రా కూడా ట్విట్లర్ ద్వారా అసహనం వ్యక్తం చేశాడు.
మరోవైపు, పాకిస్థాన్ లో కూడా బుమ్రా నోబాల్ పోస్టర్లు వెలిశాయి. పాక్ లోని ఫైసలాబాద్ ట్రాఫిక్ పోలీసులు బుమ్రా నోబాల్ చిత్రాన్ని నగరంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేశారు. బుమ్రా గీత దాటి చేసిన తప్పిదాన్ని... మీరు జీబ్రా లైన్ దాటి చేయవద్దని ఫైసలాబాద్ ట్రాఫిక్ పోలీసులు పోస్టర్లను ఏర్పాటు చేశారు. దీనిపై బుమ్రా ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.