: మధ్యప్రదేశ్ మంత్రిపై ఈసీ కొరడా.. అనర్హత వేటు!
మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రిపై ఎన్నికల కమిషన్ కొరడా ఝుళిపించింది. ఎన్నికల సందర్భంగా ప్రతి అభ్యర్థి చేసిన ఖర్చు వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలన్న సంగతి తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మంత్రి నరోత్తమ్ మిశ్రా తన అఫిడవిట్ లో ఎన్నికల ఖర్చు వివరాలు వెల్లడించలేదు. దీంతో విచారణ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయన ఎన్నికల ఖర్చుల వివరాలు అఫిడవిట్ లో చూపలేదని నిర్ధారించింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేసింది. ఈ అనర్హత వేటు మూడేళ్ల పాటు వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.