: చిన్నారి మీనా రెస్క్యూ... చిన్న సాంకేతిక తప్పిదం... పెద్ద పొరపాటైందా?


చిన్న సాంకేతిక తప్పిదం పెను ముప్పుగా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇక్కారెడ్డి గూడెంలో చిన్నారి మీనా ఆడుకుంటూ బోరుబావిలో పడిన సంగతి తెలిసిందే. 41 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న ఉదయం 40 అడుగుల లోతులో పాప ఉన్నట్టు గుర్తించారు. తొలుత స్థానికులే బావిలో ఉన్న మోటారుతో పాపను పైకి తీయాలని ప్రయత్నించారు. అయితే పాపకు గాయాలవుతాయని భావించి ఆగిపోయారు.

అయితే అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు వచ్చిన తరువాత సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో రోబో హ్యాండ్ తో పాపను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో మోటారుపైన చిక్కుకుందని భావించి దానిని జాగ్రత్తగా బయటకు తీశారు. ఇదే పెద్ద ఇబ్బందిని తెచ్చిపెట్టింది. తన కిందనున్న మోటారు అడ్డుతొలగిపోవడంతో పాప మరింత అగాధంలోకి కూరుకుపోయింది. దీంతో 230 అడుగుల లోతుకు వెళ్లిపోయిందని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News