: ట్విట్టర్ విద్వేషం... హిందువులపై ముస్లిం మహిళా డాక్టర్ అనుచిత వ్యాఖ్యలు!


ముంబైకి చెందిన అనీఖా గనీ అనే ముస్లిం మహిళా డాక్టర్‌ ట్విటర్‌ వాగ్వాదంలో నోరుజారి ఇబ్బందుల్లో పడ్డ ఘటన చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో వాగ్వాదాలు సర్వసాధారణం, ఎవరి వాదన వారు సమర్థవంతంగా వినిపించే ప్రయత్నం చేస్తారు. అవతలివారు వినకపోతే అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. ఇంకొందరు మరింత ముందుకెళ్లి బూతులు కూడా తిడతారు. అయితే, అనీఖా గనీ మతంపై చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆగ్రహంతో ‘‘కీర్తన్‌.. ఇంకోసారి నువ్వు ఇస్లాం గురించి మాట్లాడావంటే మా డయాలసిస్‌ వార్డులో రక్త శుద్ధి చేయించుకుంటున్న హిందూ రోగులందర్నీ వెళ్లగొట్టేస్తా. చచ్చి ఊరుకుంటారు’’ అంటూ వ్యాఖ్యానించారు.

అంతే కాకుండా ముస్లిమ్ ల మీద సామాజిక మాధ్యమాల వేదికగా దాడికి దిగే పిరికిపందలంతా నేరుగా బోర్డర్ కు వెళ్లి పాకిస్థాన్ తో యుద్ధం చేయాలని సలహా కూడా ఇచ్చారు. అంతే, ఆమె వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. దీంతో ఆమెపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఏ) కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆమె ఐఎంఏ, మహారాష్ట్ర వైద్య మండలి సభ్యురాలు కాదని, ఆమె డిగ్రీ అసలో నకిలీయో తేల్చాలని ఐఎంఏ... ఎంసీఐని కోరింది. కాగా, కుల, మత, ప్రాంత ప్రాతిపదికన వైద్యం నిరాకరించడం మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం నేరమని, డాక్టర్‌ పై చర్యలు తప్పవని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News