: 'అందమైన లోకమనీ.. రంగు రంగులుంటాయనీ' ఆశపడి.. చివరికి బిచ్చగాడిగా మారిన నటుడు!


సినిమా రంగుల ప్రపంచం వ్యామోహంతో అవకాశాలను వెతుక్కుంటూ చెన్నై చేరిన ఓ నటుడు చూలైమేడులోని గుడిముందు భిక్షాటన చేసేవాడిగా మారాడు. 2004లో ఘన విజయం సాధించిన 'ప్రేమిస్తే' సినిమాలో హీరో భరత్, హీరోయిన్ సంధ్యను తీసుకుని స్నేహితుడు ఉంటున్న మ్యాన్షన్ కు వెళ్తాడు. అక్కడి సన్నివేశంలో... 'విరుచ్చికాంత్ పేరుతో హీరోగా నటిస్తా, ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్తా, ఆ తరువాత సీఎం అవుతా' అంటూ పల్లుబాబు అనే నటుడు చెప్పే డైలాగులు మంచి ఆదరణ పొందాయి. ఆ నటుడు పల్లుబాబుకు తరువాత అవకాశాలు లభించలేదు. పేదరికంతో పాటు తల్లిదండ్రుల మరణం అతనిని కుంగదీసింది. దీంతో పల్లుబాబు పొట్టపోసుకునేందుకు భిక్షాటనను ఎంచుకున్నాడు. చెన్నై, చూలైమేడులోని ఓ గుడిముందు కూర్చుని వచ్చీపోయే భక్తులను బిచ్చం అడుగుతున్నాడు.

  • Loading...

More Telugu News