: విండీస్ తో తొలి మ్యాచ్ వర్షార్పణం!


పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు శిఖర్ ధావన్ (87), అజింక్యా రహానే (62) అర్థసెంచరీలతో రాణించి శుభారంభం ఇచ్చారు. అనంతరం యువరాజ్ సింగ్ (4) విఫలమయ్యాడు. కోహ్లీ (32)తో కలిసి ధోనీ (9) క్రీజులో ఉన్న సమయంలో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ను వర్షం ముంచెత్తింది. కవర్లు కప్పి క్రీజును పొడిగా ఉంచినప్పటీకి, అవుట్ ఫీల్డ్ ఆడేందుకు వీలుగా లేకపోవడంతో తొలి వన్డే వర్షార్పణమైంది. ఆట నిలిచే సమయానికి భారత జట్టు 39.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News