: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో ఏ2 రాజీవ్ మహాముదురు... పలువురు అమ్మాయిలతో సంబంధాలు.. బ్లాక్ మెయిలింగ్!
హైదరాబాదులోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసులో ఏ2 నిందితుడు రాజీవ్ గురించిన పలు విశేషాలు తాజాగా వెలుగు చూశాయి. వల్లభనేని రాజీవ్ కు పలువురు యువతులతో సంబంధాలు ఉన్నాయి. శిరీషతో పాటు మరో నలుగురు యువతులతో సన్నిహితంగా మెలగినట్టు తెలుస్తోంది. శిరీష కంటే ముందు ఇద్దరు యువతులతో ప్రేమాయణం సాగించిన రాజీవ్... వారికి తెలియకుండా తాను తీసిన అశ్లీల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి, వారిని దూరం పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.
తొలుత శిరీషను, తరువాత తేజస్వినిని వదిలించుకుందామని భావించిన రాజీవ్... నెల క్రితం మరోయువతితో పరిచయం పెంచుకున్నట్టు తెలిసింది. తేజస్విని పోలీస్ స్టేషన్ లో కేసు పెడతానని బెదిరిస్తూనే విజయవాడ వెళ్లి అతడి తల్లిదండ్రులతో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతని ఫోన్ నుంచి రాజీవ్ దాచి ఉంచుకున్న రాసలీలల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆర్జే స్టూడియోలోని హార్డ్ డిస్క్ లో కూడా అనేక ఫోటోలు, వీడియోలను గుర్తించారు. దీంతో రాజీవ్ పెద్దమోసగాడని, నేరస్వభావం ఉన్నవాడని పేర్కొన్నారు.