: రావుజీ! వర్షాలు పడుతున్నాయా?: కేసీఆర్ తో మోదీ


రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ ప్రక్రియకు ప్రధాని నరేంద్ర మోదీ మిత్రపక్షాల అధినేతలతో హాజరయ్యారు. పార్లమెంటు లైబ్రరీ హాల్ లో జరిగిన ఆ కార్యక్రమంలో మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను ఆసక్తికరంగా పలకరించి, కుశలప్రశ్నలు వేశారు.

కేసీఆర్ ను చూసిన వెంటనే ‘‘రావుజీ! వర్షాలు బాగా పడుతున్నాయా?’’ అంటూ ప్రశ్నించారు. బాగానే పడుతున్నాయని కేసీఆర్ సమాధానమిచ్చారు. దీంతో ప్రాజెక్టుల వెంట పడడంతో వర్షాలు కురుస్తున్నట్టున్నాయని సరదాగా వ్యాఖ్యానించగా, పక్కనే ఉన్న చంద్రబాబునాయుడును ప్రధాని పలకరించే సమయంలో వాళ్లకి బాగానే పడుతున్నాయని, తమకు మాత్రం సాధారణ వర్షపాతం కూడా నమోదు కావడం లేదని అన్నారు. అనంతరం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను కూడా వర్షాలు బాగా కురుస్తున్నాయా? అని ప్రధాని అడిగారు. వారు తమ రాష్ట్రాల్లో ఆశించినమేర లేవని తెలిపారు. 

  • Loading...

More Telugu News