: అభిమానుల మధ్య ‘డీజే’ చూసిన బన్నీ!
‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ చిత్రాన్ని ఆ చిత్ర హీరో అల్లు అర్జున్ తన కుటుంబసభ్యులు, చిత్ర బృందంతో కలిసి ఈ సినిమాను వీక్షించాడు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో అభిమానుల సమక్షంలో ఈ చిత్రాన్ని బన్నీ చూశాడు. అల్లు అర్జున్ తో పాటు భార్య స్నేహ, హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు వంశీ పైడిపల్లి తదితరులు ఉన్నారు. కాగా, అల్లు అర్జున్, పూజా హెగ్డే ని చూసేందుకు అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తి చూపారు. వారితో సెల్పీలు దిగారు.