: రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా!
టీమిండియా, వెస్టిండీస్ క్రికెట్ టీముల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడిన ఓపెనర్లు రహానే, శిఖర్ ధావన్‌లు అర్ధశతకాలు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం అజింక్యా రహానే 62 (78 బంతుల్లో) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోసెఫ్ బౌలింగ్‌లో హోల్డెర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే శిఖర్ ధావన్ 87 (92 బంతుల్లో) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బిషూ బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (15), యువరాజ్ సింగ్ (0) ఉన్నారు. టీమిండియా స్కోరు 32 ఓవర్లకు 168 పరుగులుగా ఉంది.