: ముగ్గురు మహిళలపైకి దూసుకెళ్లిన టాటా ఏస్ వాహనం!
విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని జూపూడి లో తమ ఇంటి మెట్లపై కూర్చున్న ముగ్గురు మహిళలపై నుంచి టాటా ఏస్ వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి బంధువులు తరలించారు.అయితే, వైద్యులు లేకపోవడంతో ఆసుపత్రిపై దాడికి క్షతగాత్రుల కుటుంబీకులు యత్నించారు.