: ఐదు గంటల్లోనే మిలియన్ క్లిక్స్.. ‘అదిరిందంతే’ అంటున్న సినీ ప్రముఖులు
హీరో దగ్గుబాటి రానా కొత్త చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది. విడుదలైన ఐదు గంటలకే ఈ ట్రైలర్ మిలియన్ క్లిక్స్ సాధించిందని సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రానా కనపడుతున్న తీరు, డైలాగులు, కాజల్ అందాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్‌పై టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
‘అదిరింది’ అంటూ హీరో నాని ఈ ట్రైలర్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తే, ఈ ట్రైలర్‌లో రానా లుక్ అద్భుతం అని, కాజల్ ఎంతో అందంగా ఉందని హీరోయిన్ లావణ్య త్రిపాఠి పేర్కొంది. నిర్మాత శోభు యార్గగడ్డ సైతం ఈ ట్రైలర్ గురించి ట్వీట్ చేస్తూ సూపర్బ్ రానా దగ్గుబాటి అని పేర్కొన్నారు. ఇక బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జొహార్ కూడా ఈ ట్రైలర్ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు. ఈ ట్రైలర్ పై స్పందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా రానా థ్యాంక్స్ చెప్పాడు.