: త్వరలో ప్రియుడిని పెళ్లాడనున్న సోనాల్ చౌహాన్!
నాటి అందాల నటి భాగ్యశ్రీ కుమారుడు అభిమన్యు దస్సానీతో బాలీవుడ్ ప్రముఖ నటి సోనాల్ చౌహాన్ ప్రేమ వ్యవహారం కొంత కాలంగా నడుస్తోందని, వారి వివాహం త్వరలోనే జరగనుందని బీ-టౌన్ లో ప్రచారం జరుగుతోంది. త్వరలో ఇరు వైపుల పెద్దలను ఒప్పంచి పెళ్లి చేసుకోవాలని ఈ జంట అనుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయమై సోనాల్ చౌహాన్ కానీ, అభిమన్యు దస్సానీ గానీ స్పందించలేదు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అభిమన్యు బర్త్ డే వేడుకలకు సోనాల్ హాజరైంది. ఇటీవల ముంబైలో జరిగిన పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ షోకు ఈ జంట కలిసి వెళ్లింది. తెలుగు చిత్రాలు ‘లెజెండ్’, ‘డిక్టేటర్’, ‘సైజ్ జీరో’, ‘షేర్’, ‘పండగ చేస్కో’, ‘రెయిన్ బో’ లలో ఆమె నటించింది. హిందీ, కన్నడ, తమిళ్ లో కూడా పలు చిత్రాల్లో సోనాల్ చౌహాన్ నటించింది.