: దయచేసి నన్నలా పిలవద్దు: ‘బాహుబలి’ ప్రభాస్ వినతి
‘బాహుబలి-2’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల నిర్మాత కరణ్ జొహర్ బాలీవుడ్ తారలకు పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభాస్, బాలీవుడ్ స్టార్స్ కి మధ్య జరిగిన ఓ సంభాషణ తాజాగా బయటకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌తో ఆ పార్టీలో బాలీవుడ్ నటులు సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నారు.
ఈ పార్టీలో తనతో మాట్లాడే సమయంలో బాలీవుడ్ స్టార్స్ తనని 'సర్' అని పిలుస్తుండటంపై ప్రభాస్ ఇబ్బంది పడ్డాడు. తనని సర్ అని పిలవకూడదని బాలీవుడ్ హీరోలు వరుణ్ ధావన్, అర్జున్ కపూర్లతో అన్నాడు. తనను ప్రభాస్ అనే పేరు పెట్టి పిలవాలని చెప్పాడట. అయితే, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ మాత్రం ప్రభాస్‌తో మీరు మాకు బాహబలి అని, మిమ్మల్ని అలా పేరు పెట్టి పిలవలేమని గౌరవంగా అన్నారు.