: ఎట్టకేలకు నీట్‌ ఫలితాలు విడుదల... తెలుగు విద్యార్థులకు మెరుగైన ర్యాంకులు


ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నిర్వ‌హించిన‌ నీట్ ఫలితాలను సీబీఎస్‌ఈ ఈ రోజు విడుదల చేసింది. ఈ నెల 26 లోపు నీట్ ఫలితాలను విడుదల చేయాలని ఇటీవ‌లే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్ష‌ను మొత్తం 12 ల‌క్ష‌ల‌ మంది విద్యార్థులు రాశారు. ఈ ఫ‌లితాల్లో పంజాబ్ ముక్త్‌సర్‌కు చెందిన విద్యార్థి నవదీప్‌సింగ్‌కి మొద‌టి ర్యాంకు వ‌చ్చింది. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన అర్చిత్‌ గుప్తా రెండో ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా ఈ ప‌రీక్ష‌లో మెరుగైన ప్ర‌తిభ క‌న‌బ‌ర్చారు. కడపకు చెందిన మన్వీత కు 14వ ర్యాంక్ రాగా ఆమె బయాలజీలో ఏపీలో టాపర్ గా నిలిచింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన విద్యార్థిని  దీపిక నీట్‌లో 24వ ర్యాంకు సాధించింది.

  • Loading...

More Telugu News