: ట్రంప్ భార్యలా కనిపించడానికి పాట్లు.. ఆరు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న మహిళ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియాలా కనిపించేందుకు 42 ఏళ్ల క్లాడియా అనే మహిళ ఏకంగా ఆరు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది. టెక్సాస్ కు చెందిన ఈమెకు మెలానియా అంటే చాలా ఇష్టమట. ఆమెను చూసినప్పుడల్లా ఏదో తెలియని శక్తి వస్తుందని క్లాడియా చెబుతోంది. ఫ్రాంక్లిన్ రోజ్ అనే వైద్యుడు ఆమెకు సర్జరీలు చేశాడు. తన సర్జరీ ఫొటోలు, వీడియోలను క్లాడియా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. దీంతో, ఆమెకు టెక్సాస్ లో విపరీతమైన పాప్యులారిటీ పెరిగిపోయింది.