: కేకేను సస్పెండ్ చేయండి: రేవంత్ రెడ్డి
భూములను కబ్జా చేసేవారిని టీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడుతోందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. భూ దోపిడీదారులపై చర్యలు తీసుకునే అవకాశం లేకుండా ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. మొత్తం 816 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారి ఫిర్యాదు చేసినా, విచారణ జరపలేదని విమర్శించారు. అటవీ భూములను ఆక్రమించిన టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.