: చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హాజరైన రజనీకాంత్ కూతురు సౌందర్య
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య తన భర్త అశ్విన్ రామ్ కుమార్ నుంచి విడాకులు కోరుతూ గత ఏడాది కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు ఈ రోజు సౌందర్య హాజరైంది. విడిపోవడానికి గల కారణాలను, అందుకు సంబంధించిన జాయింట్ అగ్రిమెంట్ ను వచ్చే వాయిదా నాటికి సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆయా పత్రాలను కోర్టు పరిశీలించి, వారిద్దరిని సంప్రదించిన అనంతరం విడాకులు మంజూరు అవుతాయి. కాగా, 2010లో అశ్విన్ తో సౌందర్య వివాహం జరిగింది. వారి వైవాహిక జీవితానికి గుర్తుగా ఓ బిడ్డ ఉంది.