: విజయసాయితో కలసి సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్


ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణలపై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఈ ఉదయం హాజరయ్యారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డితో కలసి జగన్ కోర్టుకు వచ్చారు. కేసు హియరింగ్ కు వచ్చేంత వరకూ వేచి వున్నారు. విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించిన అనంతరం ఆయన వెళ్లిపోయారు. కాగా, ఈ కేసును ప్రతి శుక్రవారం కోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News