: నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మూసేయండి... ఎవరైనా నిరాకరిస్తే మాకు చెప్పండి: తెలంగాణ పోలీస్ శాఖ


నిరుపయోగంగా ఉన్న బోరుబావులను తక్షణం మూసివేయాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. బోరుబావులు తవ్విన తరువాత నీరు పడలేదని, వినియోగించడం లేదని నిరుపయోగంగా వదిలేసిన బోరుబావులను తక్షణం పూడ్చివేయాలని ఆదేశించారు. సమస్యలు ఉత్పన్నమైన తరువాత మేల్కొనే కంటే ముందుగానే చర్యలు చేపట్టడం శ్రేయస్కరం అని వారు చెప్పారు. ఇలా బోరుబావులు పూడ్చేందుకు ఎవరైనా నిరాకరించినా, నిర్లక్ష్యం చేసినా తమకు సమాచారం ఇవ్వాలని తెలంగాణ పోలీసులు ప్రకటన జారీ చేశారు. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమకు తెలుసని వారు స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News