: నిక్కర్లు వేసుకోవద్దని ఆదేశించడంతో.. అమ్మాయిల దుస్తుల్లో పాఠ‌శాల‌కు వచ్చిన విద్యార్థులు!


వాళ్ల‌కు అనుకూలంగా పాఠ‌శాల నియ‌మాలు లేక‌పోతే వాటికి వినూత్నంగా ఎలా నిర‌స‌న తెల‌పాల‌నే విష‌యంలో విద్యార్థులు ఎప్పుడూ ముందుంటారు.  నిక్క‌ర్లు వేసుకుని పాఠ‌శాల‌కు రావ‌డాన్ని నిషేధిస్తూ బ్రిట‌న్‌లోని ఓ పాఠ‌శాల జారీ చేసిన ఆదేశానికి నిర‌స‌న‌గా, ఆ పాఠ‌శాల విద్యార్థులు అమ్మాయిల దుస్తుల‌తో హాజ‌ర‌య్యారు.

రోజురోజుకీ పెరుగుతున్న వేడి కార‌ణంగా ఎక్సెట‌ర్ సిటీలోని ఇస్కా అకాడ‌మీ విద్యార్థులు కొద్దిరోజులుగా నిక్క‌ర్లు వేసుకుని పాఠ‌శాల‌కు వ‌స్తున్నారు. అలా రావ‌ద్ద‌ని పాఠశాల యాజ‌మాన్యం ఆదేశాలు జారీ చేసింది. మ‌రి మేం వేడిని ఎలా త‌ట్టుకోవాలి? అంటూ 30 మంది విద్యార్థులు అమ్మాయిలు వేసుకునే స్క‌ర్ట్‌ల‌తో హాజరై నిర‌స‌న వ్య‌క్తం చేశారు. వారిపై ఎలాంటి చ‌ర్య తీసుకోలేద‌ని, త్వ‌ర‌లో ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం సూచిస్తామ‌ని పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయురాలు ఆమీ మిచెల్ తెలిపారు.

  • Loading...

More Telugu News