: పాకిస్థాన్ కు సహకారం నిలిపివేయాలంటూ అమెరికా చట్ట సభలో బిల్లు!
అగ్రరాజ్యం అమెరికా అందిస్తున్న డిఫెన్స్ సహకారం, ఆయుధాల కొనుగోలుకు రుణం లాంటి సదుపాయాలను త్వరలో పాకిస్థాన్ కోల్పోనుందా? టెక్సాస్ రిపబ్లికన్ టెడ్ పోయ్, మరో నాయకుడు నోలన్‌తో కలిసి పాకిస్థాన్‌కు 'నాటోయేతర దేశాలలో ప్రధాన మిత్రదేశం' హోదాను రద్దు చేయాలని అమెరికా చట్టసభలో ప్రవేశపెట్టిన బిల్లుతో ఈ ప్రశ్న తలెత్తింది.
ఈ సందర్భంగా పోయ్ మాట్లాడుతూ, `ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అమెరికాను పాకిస్థాన్ దొంగదెబ్బ తీస్తోంది. మన సహకారంతో ఆయుధాలు కొనుగోలు చేస్తూ మన ప్రజల రక్తాన్ని కళ్లజూస్తోంది. అందుకే పాకిస్థాన్‌కు మన సదుపాయాలను నిలిపివేయాలి` అన్నారు.
అల్ ఖాయిదా, తాలిబాన్లతో పోరాటంలో సహకరించాలని కోరుతూ 2004లో అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్ పాకిస్థాన్‌కు మేజర్ నాన్ నాటో అల్లీ హోదాను కల్పించారు. ఇందులో భాగంగా రక్షణ రంగంలో అవసరమైన సహకారాన్ని అమెరికా అందించేలా ఒప్పందం చేసుకున్నారు.