: నామినేషన్ వేసి బయటకు రాగానే కోవింద్ ను చుట్టుముట్టిన బ్లాక్ క్యాట్ కమాండోలు.. 'జడ్ ప్లస్' భద్రత!


ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన రామ్ నాథ్ కోవింద్ కు ఆ వెంటనే జడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. నామినేషన్ వేసే ముందు వరకూ సాధారణ సెక్యూరిటీ మధ్యే గడిపిన కోవింద్, బయటకు రాగానే బ్లాక్ క్యాట్ కమాండోల మధ్య చేరిపోయారు. అంతకుముందు ఆయన తరఫున నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి సెట్ పై ప్రధాని నరేంద్ర మోదీ, రెండో సెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు, మూడో సెట్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, నాలుగో సెట్ పై బాదల్ లు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కోవింద్ ను కలిసి అభినందించేందుకు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు పోటీ పడ్డారు.

  • Loading...

More Telugu News