: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హౌస్ అరెస్ట్


వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లాలోని సి.రామాపురంలో ఉన్న డంపింగ్ యార్డును తరలించాలంటూ చెవిరెడ్డి గత మూడు రోజులుగా నిరవధిక దీక్షను చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో, గత అర్ధరాత్రి అక్కడకు భారీగా చేరుకున్న పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు, చెవిరెడ్డిని అరెస్ట్ చేయకూడదంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడ నుంచి తరలించారు. ప్రస్తుతం సి.రామాపురం గ్రామంలో 144 సెక్షన్ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News