: లోకేష్ కోసం ఫ్లెక్సీ కడుతుండగా విషాదం!
చిత్తూరు జిల్లా సోమల మండలంలో విషాదం చోటు చేసుకుంది. కందూరు గ్రామంలో మంత్రి నారా లోకేష్ కు ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఓ టీడీపీ కార్యకర్త అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో, అక్కడ విషాద వాతావరణం నెలకొంది. జరిగిన ఘటనపై పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.