: మరి కాసేపట్లో 10,710 మంది అదృష్ట భక్తులను ఎంపిక చేయనున్న టీటీడీ


తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆర్జిత సేవలకు సంబంధించిన భక్తులను ఆన్ లైన్ ఎన్ రోల్ మెంట్, ఆపై లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, సెప్టెంబర్ నెల సేవలకు గాను లక్ష మందికి పైగా సేవలు చేసేందుకు ఆసక్తి చూపుతూ నమోదు చేసుకోగా, వారి నుంచి ఈ మధ్యాహ్నం 12 గంటలకు 10,710 మందిని ఎంపిక చేయనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఎన్ రోల్ మెంట్ ముగియగా, నిన్న సాయంత్రం 6 గంటల వరకూ 86,150 మంది దరఖాస్తు చేసుకున్నట్టు టీటీడీ వెల్లడించింది.

వీరిలో 60,166 మంది తాము కోరుకున్న తేదీల్లో, తమకు నచ్చిన సేవలు కావాలని కోరుకోగా, 25,977 మంది లభించిన రోజున, సేవ చేసేందుకు వస్తామని దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ నెలలో సుప్రభాతం 6,985, తోమాల సేవ 90, అర్చన 90, అష్టదళ పాదపద్మారాధన 120, విశేష పూజ 1,125, నిజపాద దర్శనం 2,300 టికెట్లను టీటీడీ భక్తులకు కేటాయించనుంది. అదృష్ట భక్తులకు మొబైల్, రిజిస్టర్డ్ ఈ-మెయిల్ కు సమాచారం ఇస్తామని, 30వ తేదీ 12 గంటల్లోగా డబ్బులు చెల్లించాల్సి వుంటుందని టీటీడీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News