: సక్సెస్... చరిత్ర నెలకొల్పాం... 50 రోజుల్లో మూడు ప్రయోగాలు విజయవంతంగా చేశాం: ఇస్రో


నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన పోలార్‌ ఉపగ్రహ వాహకనౌక (పీఎస్‌ఎల్‌వీ)- సీ38 ప్రయోగం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. ఈ ప్రయోగంతో ఇస్రో చరిత్ర నెలకొల్పిందని శాస్త్రవేత్తలు తెలిపారు. గడచిన రెండు నెలల కాలంలో 50 రోజులు ఇస్రోకు చాలా క్లిష్టమైన సమయమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎందుకంటే ఈ 50 రోజులలో ఇస్రో మూడు అంతరిక్ష ప్రయోగాలు చేసిందని గుర్తుచేశారు. మూడు ప్రయోగాలు అత్యంత భారీ వ్యయంతో కూడినవని, ప్రతిష్ఠాత్మకంగా భావించి, మూడు పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశామని వారు తెలిపారు. ఈ విజయం ఇస్రోకు మరింత స్పూర్తినివ్వగా, ఇస్రో ఖ్యాతిని మరింతగా పెంచిందని వారు అభిప్రాయపడ్డారు. 

  • Loading...

More Telugu News