: ఓడిన బాధలో ఉన్న ఆటగాడికి కుంబ్లే గట్టి క్లాస్: బీసీసీఐ అధికారి వెల్లడించిన కీలకాంశం
అసలే పాకిస్థాన్ తో ఓడిన బాధలో ఉన్న సమయంలో ఓ క్రికెటర్ ను అనిల్ కుంబ్లే తీవ్రంగా విమర్శించారని బీసీసీఐ అధికారి ఒకరు కీలకాంశాన్ని వెల్లడించారు. మ్యాచ్ ముగిసిన వెంటనే కుంబ్లే సదరు ఆటగాడి ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, కేకలేశాడని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని అధికారి తెలిపారు. ఓ కోచ్ గా లోపాలు చెప్పి, సలహా, సూచనలు ఇవ్వడం కుంబ్లే విధి అయినప్పటికీ, అందుకు ఎంచుకున్న సమయం మాత్రం తప్పని అభిప్రాయపడ్డారు. దేనికైనా ఓ సమయం ఉంటుందని, జట్టు కీలక మ్యాచ్ లో ఓడిన బాధలో ఆటగాళ్లు ఉంటే, కోచ్ వచ్చి నలుగురి ముందూ తప్పులు లెక్కించడం ఎంతమాత్రమూ సరికాదని చెప్పాడు.