: నితీష్ చారిత్రక తప్పిదం చేస్తున్నారు: లాలూ ప్రసాద్ యాదవ్
ఎన్డీయే అభ్యర్థికే తన మద్దతు అని జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రకటించడం పట్ల సంకీర్ణ భాగస్వామి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడుతున్నారు. నితీష్ కుమార్ చారిత్రక తప్పిదం చేస్తున్నారని లాలూ వ్యాఖ్యానించారు. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్ ను ప్రకటించిన అనంతరం నితీష్ ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇచ్చే నిర్ణయంపై పునరాలోచించాలని సూచించారు. నేడు నితీష్ ను కలుస్తానని లాలూ తెలిపారు.
కాగా, నితీష్ కుమార్ ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతిస్తానని తెలిపారు. దీనిని లాలూ వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షం ప్రతిపాదించిన మీరా కుమార్ కు మద్దతివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై లాలూ గట్టిగా పట్టుబడితే మాత్రం వారి పొత్తుపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.