: క్షమాభిక్ష కోరిన కులభూషణ్ జాదవ్.. పాక్ ఆర్మీ చీఫ్ కు పిటిషన్


గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ క్షమాభిక్ష కోరుతూ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఖొమర్ జావేద్ బజ్వాక్ కు ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, గూఢచర్యం కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 10న కులభూషణ్ కు పాక్ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించడంతో ఈ తీర్పుపై స్టే విధించింది.

  • Loading...

More Telugu News