: ఆమె సంకల్పానికి అందాల కిరీటం దాసోహం
బ్రిటన్ లో స్థిరపడిన భారత సంతతి యువతి నేహాల్ భొగైతా మొత్తానికి తన సంకల్ప బలంతో, తన అపార ప్రతిభ, అందంతో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ అందాల కిరీటాన్ని దక్కించుకున్న తొలి బధిర యువతిగా చరిత్ర సృష్టించింది . కౌలాలంపూర్ లో ఈ రోజు జరిగిన అందాల పోటీ పైనల్స్ లో హిందీ పాటకు నేహాల్ చేసిన నృత్యం చూసేవారి మనసులను గెలుచుకుంది. వాస్తవానికి నేహాల్ కు వినపడదు. అయినా పాటకు అడుగులు కలపడం విశేషం. శభాష్ నెహాల్ కీపిటప్!