: నా వ్యాఖ్యలను వక్రీకరించారు: వెంకయ్యనాయుడు


‘రైతులకు రుణమాఫీ చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది’ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలు విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు స్పందిస్తూ, తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. దీర్ఘకాలిక సమస్యలపై దృష్టి పెట్టకుండా కేవలం తాత్కాలిక సమస్యలనే పట్టించుకోవడం కొన్ని రాజకీయపార్టీలకు ఫ్యాషన్ అయిపోయిందనేది తన ఉద్దేశమని, రుణ మాఫీలు చేయడం ఒక్కటే పరిష్కారం కాదన్నానని ఈ నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలు చేశానని సమర్థించుకున్నారు.

ముఖ్యంగా ఉచితంగా గ్రైండర్లు, మిక్సీలు, పిల్లలకు లాలీపాప్స్ వంటివి ఉచితంగా ఇచ్చే రాజకీయపార్టీల తీరును విమర్శిస్తూ తాను ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు. రైతు సమస్యలతో పాటు, కొన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్ల కొరత, సరైన రహదారులు లేకపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటి అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించానని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News