: భర్త విపరీత ప్రవర్తనపై సైబరాబాద్ పోలీసులకు భార్య ఫిర్యాదు.. నిజాన్ని తేల్చిన పోలీసులు!


త‌న భర్త చేస్తోన్న‌ వికృత చేష్టలపై ఓ భార్య ఈ రోజు సైబ‌రాబాద్ పోలీసుల‌కి ఫిర్యాదు చేసింది. త‌న‌తో కలిసి సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన‌ దృశ్యాలను త‌న భ‌ర్త అత‌డి స్నేహితుడికి పంపుతున్నాడ‌ని తెలిపింది. తన భర్త స్నేహితుడు శ్రీమ‌న్‌ ఆన్‌లైన్‌ ద్వారా చెన్నైలో ఆ దృశ్యాల‌ను చూస్తున్నాడ‌ని చెప్పింది. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త కృష్ణ చైతన్యను అరెస్ట్ చేసి, అత‌డి లాప్‌ట్యాప్, స్మార్ట్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని మ‌రిన్ని వివ‌రాలు తెలిపారు. కృష్ణ చైతన్య మాత్ర‌మే ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డం లేద‌ని, అత‌డి స్నేహితుడు శ్రీమ‌న్ కూడా త‌న భార్య న్యూడ్‌ ఫోటోలను స్కైప్‌ ద్వారా పంపించేవాడ‌ని తాము తేల్చిన‌ట్లు పోలీసులు చెప్పారు. శ్రీమన్‌ను అరెస్టు చేయ‌డానికి పోలీసులు చెన్నై వెళ్లారు.

  • Loading...

More Telugu News