: కెనడా జవాన్ రికార్డు.. సుదూరం నుంచి ఐసిస్ ఉగ్రవాదిని హతమార్చిన వైనం!
సుదూరం నుంచి ఐసిస్ ఉగ్రవాదిని కాల్చి చంపిన ఒక స్నిపెర్ జవాన్ కొత్తరికార్డు సృష్టించాడు. గత నెలలో కెనడా ప్రత్యేక సైనిక దళాలు ఇరాక్ లోని ఐసిస్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. నేరుగా శిబిరాల వద్దకు వెళ్లి కాకుండా 3,450 మీటర్ల దూరం నుంచి వారిపై సైనిక దళాలు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ఒక జవాన్ అక్కడి ఓ ఎత్తైన భవనంపైకి చేరుకుని, అక్కడి నుంచి టీఏసి-50 రైఫిల్ ద్వారా కాల్పులు జరపడంతో ఐసిస్ ఉగ్రవాది తల్లోకి ఓ బుల్లెట్ దూసుకువెళ్లి మృతి చెందాడు. కాగా, తాలిబన్ ఉగ్రవాదిని సుమారు 2,475 మీటర్ల దూరం నుంచి కాల్చి చంపిన రికార్డు బ్రిటన్ సైనికుడు క్రిగ్ హరిసన్ పేరిట ఉంది. ఈ రికార్డును ఇప్పుడు ఈ స్నిపర్ బద్దలు కొట్టాడు.