: హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం.. ట్రాఫిక్ జామ్!


హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం వర్షం కురిసింది. బోరబండ, మోతీనగర్, రాజీవ్ నగర్, యూసుఫ్ గూడ, అమీర్ పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో సుమారు ముప్పావు గంటసేపు వర్షం కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి వెళ్లే ఉద్యోగులు, పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లే విద్యార్థులు కొంత ఇబ్బంది పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.


  • Loading...

More Telugu News